తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 150 మస్టర్ల ఆబ్సెటిజం సర్కులర్ పై ఎలాంటి ఒత్తిడి కార్మికులపై లేకుండా గత పాత విధానాన్నే కొనసాగించలి అని కోరిన గుర్తింపు సంఘం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని తెలిపిన యాజమాన్యం,అదేవిధంగా సొంత ఇంటి పథకాన్ని అమలుపరచుటకు ఏర్పాటైన అధికారిక కమిటీలో యూనియన్ మెంబర్స్ ను కూడా తీసుకొని విధివిధానాలు నిర్ణయించి త్వరగా సమస్యను పరిష్కరించుటకు ఒప్పుకున్నారు, మరియుహైదరాబాదులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినందున త్వరలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తారు. అలాగే గోదావరిఖనిలో క్యాతలాబ్(గుండె జబ్బుల) హాస్పిటల్ కూడా వచ్చేనెలలోపు ప్రారంభిస్తామని తెలియజేశారు,మరియుబదిలీ వర్కర్లుగా అపాయింట్మెంట్ అవుతున్న ఉద్యోగులందరూ ఇకనుంచి జనరల్ అసిస్టెంట్ ట్రేనిగా నియమించబడతారు,అదేవిధంగా పెరిక్స్ (అలవెన్స్) లపై పడే ఇన్కమ్ టాక్స్ ను యాజమాన్యమే భరించాలనే విషయాన్ని ప్రభుత్వ అనుమతి తీసుకుని పరిష్కరించుటకు ఒప్పుకున్నారు,మరియ మెడికల్ బోర్డును యధాతధంగా కొనసాగించుటకు నిర్ణయం తీసుకున్నారు,మరియుజే ఎం ఓ 62, ఫోర్ మెన్ (మెకానికల్) 12, ఫోర్ మెన్ (ఎలక్ట్రికల్) 41, సూపర్వైజర్ (సివిల్) 1, ఆఫీస్ సూపరిండెంట్ 4, స్టాఫ్ నర్స్ 86, జూనియర్ అకౌంటెంట్ 1 లకు A1 గ్రేడ్ వారికే కాకుండా ఏ గ్రేడ్ లో ఐదు సంవత్సరాల సర్వీస్ కలిగిన పై వారందరికీ రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ క్యాడర్ E1 గ్రేడ్ ఇచ్చుటకు ఒప్పుకున్నారు,మరియు డెసిగ్నేషన్స్ మార్పు విషయమై మార్చ్ లోపల కోల్ ఇండియా కమిటీ రిపోర్ట్ ప్రకారము మార్చుటకు నిర్ణయం జరిగింది,అదేవిధంగామారుపేర్ల విషయమై ఒక్కొక్క కేసును విడివిడిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు,మరియుపర్సనల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు 9 మందికి రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీసర్ క్యాడర్ E1 గ్రేడ్ ఇచ్చుటకు అంగీకరించారు,మరియుఅన్ని గనులలో కార్మికులకు కప్బోర్డ్ లు మరియు లాకర్స్ ఏర్పాటు చేయుటకు సర్కులర్ జారీ చేస్తారు,అదేవిధంగా1000 లోపు పెన్షన్ పొందుతున్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ అయిన 2016 రూపాయలను ఇప్పించుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు, ఇతర డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, తిరుమల్ రావు సంబంధిత జనరల్ మేనేజర్లు, గుర్తింపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు కే సారయ్య , కే వీరభద్రయ్య, వై వి రావు, ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శులు అక్బర్ అలీ వంగ వెంకట్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ