తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ (ఎస్ జీ ఎఫ్) ఉమెన్స్ గిల్డ్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీలోని గీతా ఆశ్రమం సమీపంలో ఉన్న కృష్ణ కుమారి దివ్యాంగ కుటుంబానికి ఈరోజు ఆదివారం నిత్యవసరాలు, దుస్తులు, నగదు సహాయం గా అందించడం జరిగింది.భద్రాద్రికొత్తగూడెంజిల్లా SGFఉమెన్స్ గిల్డ్ అధ్యక్షురాలుడాక్టర్ నూరి మేహరున్నిసా ఆధ్వర్యంలో జరిగినఈ కార్యక్రమం లో ఉమెన్స్ గిల్డ్ ఫౌండర్ జ్యోతి రాణి, జిల్లా ప్రతినిధులు జరీనా బీ,కళ్యాణి, అంజలి, కళావతి, ఎస్.జి.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లోగాన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ