తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 42% బీసీల రిజర్వేషన్ బిల్లుపై బిజెపి టిఆర్ఎస్ దోబూచులాట ఆడుతున్నాయని బిల్లును ఆమోదించకుండా గవర్నర్ కాలయాపన చేస్తుంటే మరోవైపు పట్టించుకోవాల్సిన బిజెపి బాధ్యత లేకుండా సన్నాసుల్లా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ బిసి బంద్ పురస్కరించుకొని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క, వాకిటి శ్రీహరి, విహెచ్ హనుమంత్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,మంద కృష్ణ మాదిగ, జూజుల శ్రీనివాస్, రాజారాం యాదవ్, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, షాట్ చైర్మన్ శివసేన రెడ్డి లతో కలిసి హైదరాబాద్ లో పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ