Sunday, 02 August 2026 05:25:31 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది; జిల్లాలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 09 February 2026 07:22 PM Views : 179

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల ప్రచారం 09-02-2026 సాయంత్రం 5.00 గంటలతో పూర్తిగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్) అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ మున్సిపాలిటీల చట్టం, 2019లోని సెక్షన్ 209 ప్రకారం, నిశ్శబ్ద వ్యవధి సమయంలో ఎవరూ కూడా ఎన్నికలతో సంబంధం ఉన్న ఎలాంటి బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలను ఉద్దేశించి ఎన్నికల ప్రచార ప్రసంగాలు చేయడం, సినిమా, టెలివిజన్, ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు.అలాగే రాజకీయపరమైన ఎస్‌ఎంఎస్‌లు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపడం లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకర్షిస్తూ ఎన్నికల ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నిశ్శబ్ద వ్యవధి సమయంలో సోషల్ మీడియాలో ప్రసారం అయ్యే సందేశాలను నిశితంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.నిశ్శబ్ద వ్యవధి నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం జారీ చేసిన సూచనలు, ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలు మరియు పోలీస్ అధికారులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్ కేంద్రాల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మరియు ప్రజలు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :