Saturday, 19 September 2026 04:21:07 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

తెలంగాణ ఉద్యమకారులు మోసపోవద్దు : తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పోనుగోటి సంపత్

Date : 26 March 2026 12:48 PM Views : 457

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి చిరకాల స్వప్నమైనటువంటి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పూటకొకటి ఉద్యమకారుల జేఏసీ పేరుతో పుట్టకొస్తున్న బూటకపు సంఘాల మోసపూరిత వాగ్దానాలతో మోసపోవద్దని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పొనుగోటి సంపత్ పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుపరిచే వరకు ఉద్యమిస్తామని అనేక బూటకపు సంఘాలు తెరపైకి వస్తున్నాయని ఆ సంఘాలు నడిపేటటువంటి నాయకులు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారో, ఏ పార్టీలో ఉన్నారో నిక్కర్సైన ఉద్యమకారులు గుర్తించాలని, ఉద్యమ సమయంలో కేసులకు భయపడి ఇంటి నుండి కాలు బయటకు పెట్టని వారు నేడు ఉద్యమకారుల జేఏసీ పేర్లతో బూటకపు సమావేశాలు ఏర్పాటు చేసుకొని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 250 గజాల ఇంటి స్థలం, మరియు ఇల్లు నిర్మాణం, అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక భరోసా, అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, పెన్షన్ మరియు స్వతంత్ర సమరయోధులుగా గుర్తింపు కార్డులు ఇచ్చి అన్ని విధాలుగా ఉద్యమకారులను ఆదుకుంటాం అనే అంశాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడమే కాక వారి ఆర్థిక స్వలాభాల కోసం సభ్యత్వాల పేరుతో, వారి సంఘాల గుర్తింపు కార్డుల పేరుతో, ఇంటి స్థలాలు ఇప్పిస్తామని, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని కనీసం రిజిస్ట్రేషన్ లేని సంఘాలు అమాయకపు ఉద్యమకారులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆధారంగా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటూ ఉండగా, ఈ బూటకపు సంఘాలు ఇప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నష్టపోయిన ఉద్యమకారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొలుపుతూ ప్రభుత్వానికి నిజమైన ఉద్యమకారులకు దూరం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నారని దానికి తగిన మూల్యం త్వరలో చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కోదండరాం గారి నేతృత్వంలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని, దానికి అనుగుణంగా నిజమైన, నిక్కార్స్ అయినా ఉద్యమకారులను గుర్తించే పనిలో రాష్ట్ర ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, సిఐడి, తదితర నిఘ వర్గాల ద్వారా ఇప్పటికే అన్ని జిల్లాల నుండి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారి వివరాలు సేకరించడం జరిగిందని, నిజమైన ఉద్యమకారులు అనగా ముందస్తు అరెస్టులు, బైండ్ఓవర్ కేసులు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు, జైల్ రికార్డులు ఎవరైనా కోల్పోయినట్లయితే సమాచార హక్కు చట్టం ద్వారా పొందవచ్చని, కేసులు ఉంటేనే ఉద్యమకారులు లేదంటే ఉద్యమకారులు కాదని ఈ బూటకపు సంఘాల ప్రచారం చేస్తున్నాయని చాలామంది తెలంగాణ జేఏసీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించినప్పటికీ కేసులు కాలేదని అంతమాత్రాన వారి ఉద్యమకారులు కాదని అనడం విడ్డూరంగా ఉందన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులని వివిధ విభాగాలుగా గుర్తిస్తుందని తెలిపారు. కనీసం ఉద్యమ సమయంలో రోడ్డెక్కని నాయకులు స్వతాగా సంఘాలు ఏర్పాటు చేసుకొని వారి ఆర్థిక ప్రయోజనాల కోసం వారి మనుగడ కాపాడుకోవడం అమాయకపు తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వానికి దూరం చేయొద్దని కోరారు. ముందుగా ఉద్యమకారుల జేఏసీల పేరుతో వస్తున్న వారు ఆ నాయకుల ఉద్యమ నేపథ్యం జైలు జీవితాలు, పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు, రౌడీ షీట్లు, పీడి యాక్ట్ ,వారు చేసిన ఉద్యమ నేపథ్యం ఉద్యమకారులకు తెలిపిన తర్వాతనే సమావేశాలు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో నిజమైన ఉద్యమకారుల సమన్వయంతో చట్టపరమైన చర్యలకు సిద్ధపడుతామని హెచ్చరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :