Wednesday, 04 November 2026 10:23:38 PM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

వ్యసన బాధితులకు సమగ్ర చికిత్స, పునరావాస సేవలు అందుబాటులో- జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 11 April 2026 03:30 PM Views : 284

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వ్యసన బాధితులకు సమగ్ర చికిత్స, పునరావాస సేవలు అందించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం అదే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రాన్ని కూడా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా మత్తు వ్యసనానికి గురైన వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు, నిపుణుల పర్యవేక్షణలో పునరావాస సేవలు, నిరంతర కౌన్సిలింగ్ అందించబడతాయని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మద్యానికి బానిసై చికిత్స కోసం వచ్చిన రోగితో మాట్లాడి, రోజువారీ ఆదాయం, మద్యంపై ఖర్చు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ వ్యక్తి తాను మద్యం మానేందుకు పలు మార్లు ప్రయత్నించినప్పటికీ, వణుకుడు, ఫిట్స్ వంటి సమస్యలు రావడంతో చికిత్స కోసం ఈ కేంద్రానికి వచ్చానని తెలిపాడు. ఈ తరహా కేసులకు అందిస్తున్న వైద్య సేవలు, కౌన్సిలింగ్ విధానాలు, చికిత్స ప్రక్రియ గురించి కలెక్టర్ అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు పూర్తిగా కోలుకునేలా సమగ్ర చికిత్సతో పాటు నిరంతర కౌన్సిలింగ్ అందించాలని వైద్యులకు సూచించారు. ఇదే సందర్భంగా “డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే” కార్యక్రమం కింద నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్ ప్రశంస పత్రాలు, శిల్డులను అందజేశారు. యువతలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. మత్తు వ్యసన నిర్మూలనలో ప్రభుత్వ శాఖలు, వైద్య విభాగం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు బాధితులను ప్రోత్సహించి, ఈ కేంద్రం సేవలను వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, ఆసుపత్రి సూపర్డెంట్ రమేష్, డాక్టర్ రాధిక, డాక్టర్ రాదా మోహన్, ఇతర వైద్యులు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :