తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా నవంబర్ నెల అంతా “మీ డబ్బు – మీ క్లిక్ – మీ ఎంపిక” అనే నినాదంతో సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.ముఖ్యమైన సూచనలు: నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, పెట్టుబడి మోసాలు, స్క్రీన్ షేరింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పకూడదు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి.ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ నరేష్, టేకులపల్లి సీఐ సత్యనారాయణ, ఎస్సై జుబేదా బేగం మరియు సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ