తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ జె. శ్రీనివాసరావు కొత్తగూడెం జిల్లా కోర్టు ను సందర్శించారు. కొత్తగూడెం జిల్లా కోర్టు లో న్యాయవాదుల, కక్షిదారుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఔషధాలయము ను ప్రారంభించాడానికి కొత్తగూడెం జిల్లా కోర్టు కు విచ్చేసిన న్యాయమూర్తి ని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఘనంగా ఆహ్వానం పలికారు. న్యాయమూర్తి కీ శాలువ కప్పి, పూలమాల తో సత్కరించి, జ్ఞాపికను అందించారు. జిల్లా లో ఫ్యామిలీ కోర్టు, యస్సి యస్టి కోర్టు ఏర్పాటు చేయలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ మారపాక రమేష్ అంబటి రమేష్, ఆడపాల పార్వతి, అడపాల మహాలక్ష్మి, మణిదీప్ నాయుడు, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ