Thursday, 15 January 2026 05:42:11 AM
# సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుభాకాంక్షలు. # జర్నలిస్టుల అక్రమ అరెస్టులుహేయమైన చర్య జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడం సరైంది కాదు. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ ఎన్నికలలొ జనసేన పోటీకి సిద్ధం. వేముల కార్తీక్. # హెచ్ పి సి కంపెనీ విజయవాడ రీజినల్ పరిధిలో గృహ అవసరాల గ్యాస్ అమ్మకం లో మొట్ట మొదటి స్థానం లో నిలిచిన సివిల్ సప్లయ్స్ పాల్వంచ ఎల్ పి జి సెంటర్. # భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 60 డివిజన్లో ముగ్గుల పోటీలు. # ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # జిల్లాలోని దుమ్ముగూడెం మరియు పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది. డాక్టర్ తూకారామ్ రాథోడ్. # అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా అమలు చేస్తున్నాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి. # ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163 వ జయంతి. ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే ఖయ్యూం, జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్. # ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క # మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు . # దివ్యాంగ కుటుంబానికి నిత్యావసరాలు అందజేత # 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు, చివరి దశకు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన జట్లు. # మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు : కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్. # మెరుగైన నైపుణ్యాలతోనే యువతకు అవకాశాలు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # పాల్వంచ పట్టణంలోని శ్రీ గణేష్ నర్సింగ్ హోమ్, పద్మావతి స్కానింగ్ సెంటర్, శ్రీరక్ష హాస్పిటల్ మరియు స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ. # కెటిపిఎస్ 7 వ స్టేజ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కె. శ్రీనివాస్ బాబు ని ఘనంగా సన్మానించిన. ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై.వెంకటేశ్వర్లు. # TG TET–2026 పరీక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా నిర్వహణ: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం : భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా అమలు చేస్తున్నాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Date : 13 January 2026 06:18 PM Views : 44

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మేడారంలో మరో 200 సంవత్సరాలు నిలిచేలా రాతి నిర్మాణాలతో అభివృద్ధి పనులు.అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రెండు కళ్లలా భావిస్తూ ప్రజా ప్రభుత్వం సమన్వయంతో అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌లతో కలిసి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి నిధుల ద్వారా రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న మున్సిపల్ మార్కెట్ భవనం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నగరాభివృద్ధి నిధుల ద్వారా రూ.7 కోట్ల వ్యయంతో మంజూరైన అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయ భవన నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం దమ్మపేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా నిలుస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో అమలు చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తూ ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు.సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈ నెల 28, 29, 30, 31 తేదీలలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇది ఆదివాసీల అతిపెద్ద ఆధ్యాత్మిక జాతరగా మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారానికి తరలివచ్చే మహోత్సవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని తలపించేలా రాతి నిర్మాణ పద్ధతిలో మరో 200 సంవత్సరాలు నిలిచే విధంగా మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు రానున్నారని, 19న మేడారం పునరుద్ధరణ, అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గత రెండు సంవత్సరాల కాలంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని మంత్రి తెలిపారు. దాని ఫలితంగానే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 శాతం స్థానాల్లో ప్రజలు ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఇదే విశ్వాసంతో రానున్న ఎన్నికలలో కూడా ప్రజలు ప్రజా ప్రభుత్వానికే మద్దతు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :