Thursday, 17 September 2026 08:20:35 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

10వ వార్డులో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి

Date : 14 April 2025 07:29 PM Views : 679

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్): 134వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పదో వార్డు లోని అంబేద్కర్ చమన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం అంబేద్కర్ చమన్ లో 10వ వార్డ్ మాజీ కౌన్సిలర్ మునిగడప పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, సిపిఐ సీనియర్ నాయకులు సావటి స్వామి లు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నతనంలో అనుభవించిన అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం ఆయన పడ్డ కష్టమే భారత రాజ్యాంగం అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా కుల ,మత ,వర్గ, వైశాల్యాలు లేని సమాజం కోసం మానవులందరికీ సమాన హక్కులు కల్పించి, అందరికీ విద్యను అందించడం ద్వారానే అంటరానితనం నిర్మూలన జరుగు తున్నదని భావించిన గొప్ప దార్శనికుడని వారు కొనియాడారు .ఆయన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక సౌకర్యాలను కులం, మతం ,వర్గ బేధం లేకుండా అందరూ సమానంగా హక్కులను అనుభవిస్తున్నారు. అందుకే అంబేద్కర్ ఏ ఒక్క కులానికో ,ఏ ఒక్క మతానికో చెందిన వాడు కాదని ,అంబేద్కర్ అందరివాడు అని వారు పేర్కొన్నారు. అనంతరం భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం యొక్క ఔనత్యాన్ని కాపాడుతామని ,భారత రాజ్యాంగ మూలాలను దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఐక్యమత్యంతో అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఈ రోజు నుండి కృషి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ పూనారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు గంటాడి కోటేశ్వరరావు, బయన ఈశ్వరయ్య ,శాఖ కార్యదర్శులు సూరి మేని జనార్ధన్ ,రావుల దాసు, ఎస్కే జలీల్, సత్యనారాయణ (కొండ) ఆర్ఎంపీ డాక్టర్ సబ్బాని సతీష్, మహిళలు మార్తమ్మ టీచర్ ఎన్ సరోజ, నాయకులు అజరయ్య ,కాంపల్లి దుర్గయ్య ,బానోత్ చందర్, సూరిమేని రామారావు ,తోగరు నరేందర్ ,సబ్బని పాపారావు ,బానోత్ శ్రీను, ఉప్పతల శ్రీను, గుంజ వెంకన్న ,గోపి, సలీం, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :