తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల తహశీల్దార్ కార్యాలయంలో ప్రజల సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది . కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు రైతు భరోసా , నిరుద్యోగ భృతి, వృద్ధులు , వికలాంగులకు , వితంతు మహిళకు పెంచి ఇస్తామన్న పెన్షన్లు , భూ భారతి కింద భూ సమస్యలను , ఫీజ్ రియంబర్స్మెంట్ , జాబ్ క్యాలెండర్ , కళ్యాణ లక్ష్మీ , మహాలక్ష్మి లాంటి అనేక హామీలను ఇవ్వడం జరిగింది ఇచ్చినా అన్ని హామీలను అమలు పరచాలని బీజేపీ మండల అధ్యక్షుడు భూక్యా రమేష్ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామారావు, యువమోర్చ అధ్యక్షుడు గూగులోత్ రాంబాబు , సోషల్ మీడియా కన్వీనర్ భూక్యా చరణ్ , పాతర్లపాటి నవీన్ , కృష్ణంశెట్టి గోపాల్ రావు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ