తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామంలో రోకటి సుధాకర్ అనే రైతు మిర్చి పంటను సాగు చేస్తున్నాడు. మిర్చి నాటి రెండు నెలల 15 రోజులు అవుతున్న నేపథ్యంలో నెల రోజుల క్రితం మిర్చి తోటలో కలుపు ఉన్నదని జూలూరుపాడు ఓ పురుగుల మందుల షాపులో కొత్తగా వచ్చిన మందు అని ఇచ్చారని తోటకి ఎటువంటి అనర్ధం జరగదని మందు ఇచ్చారని అది వాడటం వలన నా తోట చనిపోతుందని ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి దీపక్ ఆనందుకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు మిర్చి పంటను కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ వి. లక్ష్మీనారాయణ, ఉద్యాన వన శాస్త్రవేత్త బి. శివ, మండల వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్, వ్యవసాయ విస్తరణాధికారి గోపికృష్ణ పంటను పరిశీలించారు. దీని యొక్క నివేదిక రెండు మూడు రోజుల్లో తెలుస్తుందని వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్ తెలియజేసారు
Admin
తెలుగు వెలుగు టీవీ