తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చండ్రుగొండ మండలం గుంపేన వద్ద సీతారామ ప్రాజెక్ట్ కాలువను బీజేపీ నాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క ఎకరాకి కూడా సాగు నీరు ఇవ్వకుండా ముగ్గురు మంత్రులు భద్రాద్రి జిల్లా రైతులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి ఏ మొఖం పెట్టుకొని భద్రాద్రి జిల్లాకి వస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ