తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గుండాలకు చెందిన యువతిని ప్రేమించి,పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ఘటనలో అదే గ్రామానికి చెందిన నిందితుడు జవ్వాజి జోషి కిరణ్ కు 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పును వెలువరించారు.2023 నవంబర్ 16వ తేదీన యువతి వద్ద నుండి ఫిర్యాదు అందుకున్న అప్పటి గుండాల ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసినారు.విచారణాధికారిగా గుండాల సీఐ ఎల్.రవీందర్ దర్యాప్తు చేపట్టి,ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి భాధితురాలు గర్భం దాల్చేలా ప్రవర్తించిన నిందితుడు జోషి కిరణ్ పై కోర్టులో ఛార్జి షీట్ ను దాఖలు చేశారు.కోర్టులో పదిమంది సాక్షులను విచారించిన పిదప నిందితుడికి 10సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించారు. ఇట్టి కేసులో నిందితుడికి శిక్ష పడేవిధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి,నోడల్ అధికారి ఎస్సై రాఘవయ్య,కోర్ట్ లైజన్ అధికారి వీరబాబు,కోర్ట్ డ్యూటీ అధికారి మహమూద్ పాషా లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ