Saturday, 19 September 2026 09:57:00 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

రైతు భరోసా నిధులను ఇతర బకాయిలకు సర్దుబాటు చేయొద్దు : బ్యాంకులకు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశం

Date : 11 July 2026 03:08 PM Views : 123

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతన్నకు అండగా రైతు భరోసా... జిల్లాలో రూ.318.42 కోట్ల నిధుల జమ 1.78 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు రైతులకు సాగు పెట్టుబడికి అవసరమైన ఆర్థిక తోడ్పాటును సకాలంలో అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద జిల్లాలో అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. రైతులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగు పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం విడతల వారీగా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1,78,828 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.318.42 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేయడం ద్వారా పంపిణీ ప్రక్రియను పూర్తిచేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకింగ్ శాఖల సమన్వయంతో పారదర్శకంగా, వేగవంతంగా నిధుల పంపిణీ నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా, రైతు బీమా, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, సాగునీటి సౌకర్యాల కల్పన తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సాగు పెట్టుబడిపై ఆర్థిక భరోసా కల్పించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో జమయ్యే నిధులను బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ బకాయిలు, సేవా ఛార్జీలు లేదా ఇతర బకాయిల పేరుతో నిలుపుదల చేయడం, డెబిట్ చేయడం లేదా సర్దుబాటు చేయరాదని జిల్లా కలెక్టర్ అంకిత్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రైతుల సాగు పెట్టుబడి కోసం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం పూర్తి మొత్తంలో రైతుల వినియోగానికి అందుబాటులో ఉండేలా అన్ని బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు భరోసా నిధులపై ఎలాంటి అనధికారిక కోతలు విధించకుండా ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని రైతులకు పూర్తిగా అందేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :