Tuesday, 03 November 2026 12:12:47 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

రామవరం రెవెన్యూ పరిధిలో భూ రీ-సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ అంకిత్

Date : 22 September 2026 03:50 PM Views : 385

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రీ-సర్వే పనులను వేగవంతం చేసి నెలన్నరలోగా పూర్తి చేయాలి పట్టా, అసైన్‌మెంట్, అటవీ భూముల హద్దులను రికార్డుల ఆధారంగా నిర్ధారించాలి కొత్తగూడెం మండలం రామవరం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుజాతనగర్–రామవరం–గరీబ్ పేట ట్రైజంక్షన్ వద్ద జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సర్వే పురోగతి, భూ హద్దుల నిర్ధారణ, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామవరం రెవెన్యూ పరిధిలో సుమారు 1,950 ఎకరాల భూమికి రీ-సర్వే నిర్వహించాల్సి ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటికే గ్రామ సరిహద్దుల నిర్ధారణ చేపట్టడంతో పాటు అటవీ భూముల హద్దులను కూడా పరిశీలించినట్లు తెలిపారు. సర్వే పరిధిలో సుమారు 146 ఎకరాల మేర అటవీ భూమి ఉన్నట్లు వివరించారు. సర్వే నంబర్లు 23, 30, 31 తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే నంబర్ 20లో పట్టా, అసైన్‌మెంట్, అటవీ భూములు కలిసి ఉన్నందున ఆయా భూముల హద్దులను రికార్డుల ఆధారంగా స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. అటవీ భూముల హద్దులు ఇప్పటికే నిర్ధారితంగా ఉన్న ప్రాంతాల్లో అనవసర జాప్యం లేకుండా మిగిలిన రీ-సర్వే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే పరిధిలో పోడు సాగు చేస్తున్న భూములు ఉన్నాయని, అర్హులైన వారికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ కింద హక్కులు కల్పించినట్లు అధికారులు వివరించారు. సుమారు 420 మందికి పైగా పట్టాదారులు ఉన్నారని, ఇందులో గిరిజనులు, ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. రీ-సర్వే ద్వారా భూ హద్దులు స్పష్టమై, హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా రికార్డులను పక్కాగా రూపొందించాలని కలెక్టర్ సూచించారు. ఈ రోజు సమ్మక్క గద్దె సమీప ప్రాంతం నుంచి సుమారు 2.3 నుంచి 2.5 కిలోమీటర్ల మేర సరిహద్దు సర్వే నిర్వహించినట్లు అధికారులు వివరించారు. అక్కడ ఉన్న పాత సరిహద్దు రాళ్లు, మ్యాప్‌లు, రికార్డులను పరిశీలించి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. రీ-సర్వే పనులను ప్రణాళికాబద్ధంగా, వేగవంతంగా చేపట్టి నెలన్నరలోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ భూ హద్దులను స్పష్టంగా నిర్ధారించి, భూ రికార్డుల్లో ఎలాంటి అయోమయానికి తావులేకుండా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ పుల్లయ్య, సర్వేయర్ అశోక్, ఆర్‌ఐ గణపతి, లైసెన్సుడ్ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది, అటవీశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :