తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి, 21 తెలుగు వెలుగు)జూలూరుపాడు మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం జూలూరుపాడు మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు పరీక్ష కేంద్రాలలో మొదటిరోజు తెలుగు పరీక్ష రాయుటకు మొత్తం 347 మంది విద్యార్థులకు గాను, 345 మంది విద్యార్థులు హాజరయ్యారు, ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కొరకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రవి ల ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసులు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ