Sunday, 02 August 2026 08:11:17 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు.

Date : 24 February 2026 08:20 PM Views : 256

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు.ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఇంటర్‌మీడియట్ మరియు పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో మంగళవారం రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రానా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య హైదరాబాద్ నుండి పాల్గొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇంటర్ మరియు పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీటీవీ పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను చురుకుగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని, చీఫ్ సూపరింటెండెంట్లు తమ బాధ్యతలను కచ్చితంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాల బయట విద్యార్థులు, సిబ్బంది సౌకర్యార్థం క్లాస్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బి సెక్షన్ ను అమలు చేయాలని అన్నారు. పరీక్షావ కేంద్రాల వద్ద అవసరమైన కిట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, అవసరమైన ఫర్నిచర్ వంటి మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ పరీక్షలను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలో రేపటి నుండి నిర్వహించనున్న ఇంటర్‌మీడియట్ వార్షిక పబ్లిక్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 25, 2026 నుండి మార్చి 18, 2026 వరకు ప్రతిరోజు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించబడనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,685 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రశ్నాపత్రాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా మరియు భద్రపరిచే ప్రక్రియలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు కల్పించినట్లు తెలిపారు .మార్చి 14, 2026 నుండి ఏప్రిల్ 16, 2026 వరకు నిర్వహించనున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు అవసరమైన సదుపాయాల కల్పన కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సాధారణ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడనున్నాయని చెప్పారు. జిల్లాలో 12,731 మంది రెగ్యులర్ విద్యార్థులు, 404 మంది ప్రైవేట్ అభ్యర్థులు నమోదు కాగా, మొత్తం 73 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ఏర్పాటు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారుల సమన్వయం, తాగునీరు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విధుల్లో పాల్గొనే అధికారులు తప్పనిసరిగా తమ ఐడీ కార్డులు ధరించి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు . సిబ్బందికి అవసరమైన శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో కి ఫోన్ లు మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు తీసుకు వెళ్లకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సమన్వయంతో, విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, జిల్లా ఇంటర్మిడేట్ అధికారి వెంకటేశ్వర్లు ,వైద్య శాఖ అధికారి తుకారాం రాతోడ్,డి పి ఓ సుధీర్, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత,రవాణా శాఖ అధికారి,టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచనరాణి ,ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :