Wednesday, 04 November 2026 05:59:18 PM
# పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్.

చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం

Date : 10 April 2026 06:40 PM Views : 613

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ఈఎన్‍టి విభాగం వైద్యులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుతూ ఒక క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. చుంచుపల్లి మండలం రామవరం గ్రామానికి చెందిన నిర్మల (40), భర్త రాయమల్లు, 09-04-2026న తీవ్రమైన గాయంతో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు Grade-4 traumatic avulsion of pinna (చెవి భాగం పూర్తిగా వేరైపోవడం) అనే అరుదైన మరియు ప్రమాదకర పరిస్థితి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ క్లిష్ట పరిస్థితిని సవాల్‌గా తీసుకున్న ఈఎన్‍టి విభాగం వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా, నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించి చెవి భాగాన్ని పునఃస్థాపన చేయడంలో విజయాన్ని సాధించింది. శస్త్రచికిత్సకు ముందు మరియు అనంతరం పరిస్థితులు కేసు తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండి, వైద్యుల పర్యవేక్షణలో మెరుగుదల దిశగా ఉంది.ఈ శస్త్రచికిత్సను డాక్టర్ శాంసన్ ఆధ్వర్యంలో ఈఎన్‍టి వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఈఎన్‍టి ఫ్యాకల్టీ, అనస్థీషియా విభాగం వైద్యులు, ఆపరేషన్ థియేటర్ నర్సింగ్ సిబ్బంది మరియు టెక్నీషియన్‌లు సమిష్టిగా చేసిన కృషి ప్రశంసనీయం.ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ విజయవంతమైన శస్త్రచికిత్స మరోసారి రుజువు చేసింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :