Wednesday, 16 September 2026 08:25:28 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

50 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు. క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 28 August 2026 07:13 PM Views : 157

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 50 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు.క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు.నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి, క్రీడాకారులకు అవసరమైన మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లతో సమగ్ర స్పోర్ట్స్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బృందావనం ప్రాంతం సమీపంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో కూడిన సమగ్ర క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడలకు అవసరమైన మైదానాలు, కోచ్‌ల సహకారం, మెరుగైన శిక్షణా సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొత్తగూడెం పేరును నిలబెడతారని పేర్కొన్నారు. మైదానాల కొరత తీర్చి, క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామారెడ్డి, వాసిరెడ్డి మురళీ, మహీధర్, పుట్టా శంకరయ్య, డాక్టర్ యుగేందర్ రెడ్డి, వాసిరెడ్డి నరేష్, ప్రేమ్, బావుసింగ్, వై.వి. వెంకటేశ్వరరావు, బాబ్జి, ఖాసీం, మాటపర్తి రమేష్, హనుమంతరావు, చలపతి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :