తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : పెనుబల్లి (M) లింగగూడెం వద్ద బుధవారం రాత్రి గేదెను ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో పద్ధం విష్ణు (19) అక్కడికక్కడే మృతి చెందగా, మీడియం శివ(19) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు. స్నేహితుడిని తీసుకువెళ్లేందుకు VM బంజర వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ