Saturday, 19 September 2026 04:21:13 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

తాలిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 12 June 2026 04:12 PM Views : 129

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి తాళిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువతో పాటు దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సాగునీటి సరఫరా, వైద్య సేవల నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మొదటగా వీరభద్రపురం గ్రామం పరిధిలోని తాళిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను పరిశీలించిన కలెక్టర్, కాలువ పరిస్థితులు, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాళిపేరు ప్రాజెక్టు ద్వారా సుమారు 24,700 ఎకరాల భూమికి సాగునీరు అందుతుండగా, ఎడమ కాలువ 46.46 కిలోమీటర్ల పొడవుతో 34 డిస్ట్రిబ్యూటరీల ద్వారా సుమారు 21,100 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కాలువలో పెరిగిన గడ్డి, చెత్త, పూడికను వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు సాగునీరు సకాలంలో అందేలా కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయకట్టు చివరి భూముల వరకు నీరు చేరేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. అనంతరం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆరోగ్య కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించి వైద్య సేవల నిర్వహణపై సమగ్రంగా ఆరా తీశారు. ఇన్‌పేషెంట్ వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు, సేవల నిర్వహణను పరిశీలించారు. ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చిన విద్యార్థులతో మాట్లాడి వారి వివరాలను తెలుసుకున్న కలెక్టర్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీకి అనుసరిస్తున్న విధానంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఔషధ నిల్వల గదిని పరిశీలించి మందుల నిల్వలు, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. అలాగే ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ రిజిస్టర్లు, ఇతర వైద్య రికార్డులను పరిశీలించారు. పాముకాటు, తేలు కాటుకు గురైన రోగులకు అవసరమయ్యే అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాముకాటుకు గురైన వ్యక్తికి అందించే చికిత్స విధానం, అనుసరించే వైద్య ప్రోటోకాల్‌పై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ రైతులకు సాగునీరు సకాలంలో అందించేందుకు కాలువల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సత్వర వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ అశోక్ కుమార్ ఇరిగేషన్ ఈ ఈ జానీ, డాక్టర్ రుక్మాకర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :