తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 57వ డివిజన్ నుంచి భారీగా తరలిన సిపిఐ నాయకులు, కార్యకర్తలు. సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు పట్టణంలోని గాజులు రాజం బస్తీ 57 వ డివిజన్ నుంచి భారీ ఎత్తున ఆ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్ ఆవరణలో ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ సూరవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్మరణ సభకు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్ నుండి మాజీ కౌన్సిలర్ సాహేర బేగం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సురవరం అమర్ రహే అంటూ నినాదాలు చేసుకుంటూ తరలి వెళ్లారు. అయితే సిపిఐ పార్టీ 3టౌన్ ఏరియా కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ యూసుఫ్ నేతృత్వంలో ఆ ప్రాంతంలోని సిపిఐ నాయకులు కార్యకర్తలు కొత్తగూడెం క్లబ్ కు చేరుకొని స్వర్గీయ సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతంలోని సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి దామెర. కుమార్, ధర్మయ్య, పిల్లి రామస్వామి, దీటి. రాజా శ్రీనివాస్, t. రాయాలింగు, ఎరువ. శివ కుమార్, సునిల్ , దిలీప్, లాలయ్య, సరోజ, RP రాజకుమారి, అనూష, విజయ లక్ష్మి, రమా, సైండ్ల. స్వాతి, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ