తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పుస్తకాల పురుగులుగా మారుతున్నారని,అలా కాకుండా సాంస్కృతిక పోటీల్లో,క్రీడల్లో రాణించినప్పుడే వారు మానసిక ఉల్లాసంగా ఉంటారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్,న్యాయవాది యెర్రా కామేష్ అన్నారు.కొత్తగూడెం క్లబ్ లో రైసింగ్ స్టార్ డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి సూపర్ డాన్స్ సీజన్ -3 పోటీలకు ముఖ్య అతిథిగా కామేష్ హాజరై డాన్స్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.అనంతరం కామేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం పుస్తకాలకే పరిమితం చేస్తున్నారని,ఇలా చేయడం వల్ల వారిలో దాగి ఉన్న కళలను బయటకు తీయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.అలా కాకుండా ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా ప్రతిభ దాగి ఉంటుందని ఆ ప్రతిభను గుర్తించి,వారికి తగిన శిక్షణను ఇస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు.డాన్స్ పోటీలకు విచ్చేసిన చిన్నారులను చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు.ఎలాంటి బెరుకు లేకుండా చిన్నారులు అద్భుతంగా తమ నృత్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు.కొత్తగూడెం కళాకారులు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.సూపర్ డ్యాన్సర్ 2వ సిరీస్ వల్లే 3వ సిరీస్ పోటీలు చాలా చక్కగా నిర్వహించిన డాన్స్ మాస్టర్స్ కనకం ప్రవీణ్ కుమార్,సందెబోయిన సంపత్ కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు.న్యాయనిర్ణేతలుగా హైదరాబాద్ దీపక్,రచ్చ మధు,భద్రాచలం శ్యామ్ లు వ్యవహరించారు.ఈకార్యక్రమంలో యామిని ఆసుపత్రి వైద్యులు యామిని కుమారి,నరసింహ సంజీవ్ రావు,మాజీ కౌన్సిలర్ రుక్మెంధర్ బండారి,కొప్పుల యశ్వంత్,సహాస్,సన్నీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ