Wednesday, 16 September 2026 06:00:57 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కొత్తగూడెం ఏరియాలో పర్యటించిన సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధావత్ వెంకన్న, ఐఆర్ టిఎస్

Date : 08 August 2025 07:36 PM Views : 527

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలో పర్యటించిన సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధావత్ వెంకన్న, ఐఆర్ టిఎస్ .. కొత్తగూడెం ఏరియాలోని కిష్టారం ఓసి, జెవిఆర్ ఓ.సి, జెవిఆర్ సి.హెచ్.పి, కొత్తగూడెం జిఎం కార్యాలయం నందు వివిధ విభాగాధిపతులతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బాధావత్ వెంకన్న, ఐఆర్ టిఎస్ సమీక్ష నిర్వహించారు. సింగరేణి నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా కొత్తగూడెం ఏరియాను సందర్శించారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు కొత్తగూడెం ఏరియా తరపున పూల మొక్క మరియు శాలువాతో ఘనంగా స్వాగతించారు. అనంతరం కిష్టారం ఓసీ అలాగే జేవిఆర్ఓసి ఉపరితల గనుల యొక్క మ్యాపుల ద్వారా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్, సంబంధిత ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఉపరితల గనుల యొక్క వివరాలను వివరించారు.ఈ సందర్భంగా జిఎం నూతనంగా అనుమతులు వచ్చిన ప్రాజెక్టు వికే ఓ.సి ఉపరితల మైన్ వివరాలను, వాటి యొక్క రికార్డులను వివరించారు.అనంతరం వారు కిష్టారం ఓసీ, జెవిఆర్ ఓ.సిలను సందర్శించి వ్యూ పాయింట్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి అక్కడ జరుగుతున్న రోజు వారి బొగ్గు ఉత్పత్తి,రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.ఎం శ్రీ. ఎం.షాలేం రాజుగారిని అడిగి తెలుసుకున్నారు. బొగ్గు యొక్క నాణ్యతను పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించి రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలతో బొగ్గు నాణ్యత సామర్థ్యం ఉత్పతి ఐయే లాగా చూడాలని అలాగే ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలతో బొగ్గు ఉత్పత్తి తీయాలని సూచించారు. అనంతరం కిష్టారం ఓసి & జేవిఆర్ ఓసిల నందు ప్లాంటేషన్ చేశారు.అనంతరం జెవిఆర్ సి.హెచ్.పి లోడింగ్ పాయింట్ ను సందర్శించి సి.హెచ్. పి నందు రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణా గురించి, సైలో బంకర్ నుండి దుమ్ము ధూళి వెలువడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు బొగ్గు రవాణాను చేయాలని, బొగ్గు యొక్క గ్రేడ్ లను పరిశీలించి నాణ్యమైన బొగ్గును సరఫరాచేయాలనీ సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం వారు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం సందర్శించారు ఈ సందర్భంగా వివిధ విభాగాల శాఖాధిపతులు, అధికారులు వారిని పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావం పనిచేసి, సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో జిఎం గారితో పాటు ఎస్ ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఏరియా ఇంజనీర్ కే. సూర్యనారాయణ రాజు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు జేవిఆర్ ఓసి ఎన్.వి.ఆర్ ప్రహ్లాద్, కిష్టారం ఓసి ఎంవి. నరసింహారావు, జేవిఆర్ సి.హెచ్.పి డీజీఎం (ఈ&ఎం) కె. సోమశేఖర్, డీజీఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, డీజీఎం (ఐఈడి) ఎన్. యోహాన్, కొత్తగూడెం ఏరియా ఇతర విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :