తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలాలు షైనీ,లైకా లను గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ రెండు జాగిలాలు జిల్లా పోలీస్ శాఖలో సేవలందించేందుకు రావడం సంతోషకరమన్నారు.పోలీస్ జాగిలం షైనీ కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లాల్ సింగ్,లైకా కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న కే.ముత్తయ్య,ఇతర డాగ్ స్క్వాడ్ అధికారులు,సిబ్బందికి ఈ సందర్బంగా ఎస్పీ పలు సూచనలు చేశారు.ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 12 పోలీస్ జాగిలాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.జాగిలాల సంరక్షణ,వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ