తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఫుడ్ కోర్టుకు సంబంధించిన సమస్యలను ఈరోజు ఉదయం కలెక్టరేట్ కు వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ కు వివరించడం జరిగింది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 35 వ వార్డు లో నిర్మించిన KGFC లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఎండ తీవ్రత అధికంగా ఉండడం వలన ఆహారం త్వరగా పాడు అవడం, కరెంటు కూడా లేకపోవడం వలన షాపులలో ఉండడం నిర్వహించడం కష్టం గా ఉంది, ఫుట్ పాత్ కృంగడం వలన అక్కడకి వచ్చే కొనుగోలుదారులుఇబ్బంది పడుతున్నారు, సామానులు పెట్టుకోవడానికి సరియైన సౌకర్యం లేకపోవడం వలన ప్రతీ రోజూ సామానులు ఇంటికి తీసుకుని వెళ్ళి రావడం ఖర్చు తో కూడుకున్నది అని తెలిపారు, మెష్ డోర్స్, కరెంటు, వాటర్ పైప్ లైన్స్, డ్రైనేజీ లింకప్ చేపించి ఇస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది అని విన్నవించారు కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ పరిరక్షక సమితి ఆధ్వర్యంలో ఫుడ్ కోర్ట్ అధ్యక్షులు జి వరలక్ష్మి కోశాధికారి రాధిక ఇతర సభ్యులు లక్ష్మి, కృష్ణ కుమారి, సరోజ, రాజ్యలక్ష్మి, దివ్య, మంజుల తదితరులు అదనపు కలెక్టర్ విద్యా చందన కు విజ్ఞాపన పత్రం అందజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ