Thursday, 17 September 2026 04:47:47 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే, భూసేకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 20 June 2026 04:43 PM Views : 311

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అక్కినేపల్లి, లింగంపల్లి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించిన జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లాలో ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే, నాన్-క్యాడస్ట్రల్ సర్వే, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం దమ్మపేట మండలంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దమ్మపేట మండలం అక్కినేపల్లి గ్రామంలో చేపడుతున్న నాన్-క్యాడస్ట్రల్ సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. సర్వే ప్రక్రియ, భూముల హద్దుల గుర్తింపు, రికార్డుల నమోదు విధానాలను అడిగి తెలుసుకుని పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం దమ్మపేట మండలం లింగంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1458లో కొనసాగుతున్న ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. అటవీ మరియు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలించి, భూముల సరిహద్దుల నిర్ధారణలో ఖచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందిస్తూ అక్కినేపల్లి గ్రామ పరిధిలో సుమారు 4,400 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని తెలిపారు. మరో రెండు నెలల్లో సర్వే ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు వివరించారు. దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను మ్యాప్ ద్వారా పరిశీలించి, ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, సర్వే, సరిహద్దుల నిర్ధారణ అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రాజెక్టు పనులకు ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఫారెస్ట్–రెవెన్యూ జాయింట్ సర్వే ద్వారా అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ధారణ కావడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే వివాదాలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వే, భూసేకరణ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి మధు, దమ్మపేట తాసిల్దార్ రామ్ నరేష్, ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు,సర్వేయర్ నాగరాజు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :