Thursday, 17 September 2026 05:11:50 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సేవా స్ఫూర్తికి ప్రతీకగా కోదండరాం జన్మదిన వేడుకలు .

Date : 05 September 2026 07:19 PM Views : 134

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సేవా స్ఫూర్తికి ప్రతీకగా కోదండరాం జన్మదిన వేడుకలు.రక్తదానం.. భారీ అన్నదానం.. అనాథ పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం నాడు తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పోనుగొటి సంపత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను కేవలం కేక్ కటింగ్, శుభాకాంక్షలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలకు నాంది పలకాలని కోరారు. చేయడం రక్తదాన కార్యక్రమం, కేక్ కటింగ్, భారీ అన్నదానం, అనాథ పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలను ఒకే వేదికగా నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను సంపత్ చాటిచెప్పారు.సాధారణంగా జన్మదిన వేడుకలను వ్యక్తిగత సంబరాలుగా నిర్వహించడం పరిపాటిగా మారిందని అలాంటి వ్యవస్థకు స్వస్తి చెప్పి, రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం కల్పించాలన్నారు. యువతలో సేవా భావాన్ని పెంపొందించడమే కోదండరాం లక్ష్యమని దానికనుగుణంగానే మనమందరం పనిచేయాలని పొనుగోటి సంపత్ తెలిపారు. అదేవిధంగా కోదండరాం జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ యార్డ్ లోని హమాలీలకు, రోడ్లపై ఉన్న అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం కంటే గొప్ప మానవతా సేవ మరొకటి లేదనే భావనతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పట్టణంలోని సత్యసాయి అనాధ శరణాలయం, వనవాసి శరణాలయంలో అనాథ పిల్లలకు నోట్ పుస్తకాలు మరియు చదువుకునే సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది.విద్య అనేది ప్రతి చిన్నారి హక్కు అనే భావనతో, ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన పిల్లలకు విద్యా సామగ్రి అందించడం ద్వారా వారికి అండగా నిలిచామన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం గారి జన్మదిన పురస్కరించుకొని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు మరియు కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోదండరా ఆయురారోగ్యాలతో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కోదండరాం గారు పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ పలువురు వక్తలు ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలు, హక్కులు, ఆత్మగౌరవం చుట్టూ సాగిందని, అదే స్ఫూర్తితో సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం అవసరమని పేర్కొన్నారు. ఈ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గొర్ల సురేష్, ఉద్యమ నాయకులు మధు, ఇజాజ్,రమేష్, వివిధ కళాశాలల విద్యార్థులు, మలిదశ తొలిదశ ఉద్యమకారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :