తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం, ఆగస్టు 10న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని బోనాల పండుగ సెలవు సందర్భంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున జిల్లా అధికారులు అందుబాటులో ఉండరని, ఈ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్నిరద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించేందుకు ఆగస్టు 10న ఐడీఓసీ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ