తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు డిఎస్పీ రెహమాన్ సూచనలతో ఈ రోజు నుండి కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు లైసెన్సులు లేకుండా ఆటోలను నడుపుతున్న రామవరం, సూపర్ బజార్,లక్ష్మీదేవిపల్లి,సుజాతనగర్ అడ్డా లకు చెందిన 05గురు డ్రైవర్లకు జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో లెర్నింగ్ లైసెన్స్ లను ఇప్పించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ తెలియజేశారు.డ్రైవింగ్ లైసెన్సులు పొందడానికి అర్హతలు కలిగి ఉండి లైసెన్సులు తీసుకోకుండా వాహనాలు నడిపే వారిపై గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ