Saturday, 19 September 2026 08:53:05 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నావంతు కృషి చేస్తా : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Date : 18 June 2026 05:05 PM Views : 305

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇండ్ల స్థలాలపై పలుమార్లు సీఎంకు విన్నవించా పండుగ వాతావరణంలో కొత్తగూడెం ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతుగా కృషి చేస్తున్నానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించే విషయమై ఇప్పటికే పలుమార్లు సీఎంతోనూ మాట్లాడనని అన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన కొత్తగూడెం ప్రెస్ క్లబ్ను కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ మూడ్ గణేష్తో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జర్నలిస్టుల కోసం కొత్తగూడెంలో పది ఎకరాల స్థలాన్ని ఇతరత్రా వాటికి కేటాయించకుండా కాపాడుతున్నానన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు తాను ఎప్పుడు అండగా ఉంటానన్నారు. నగరంలో సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా హామీలతోనే కాలం వెళ్లబుచ్చిందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇండ్ల స్థలాల విషయంలో జాప్యం చేస్తుండడం బాధాకారమన్నారు. ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో వెలుగు స్టాఫ్ రిపోర్టర్ కీలక భూమిక పోషించడం అభినందనీయమన్నారు. ఈ ప్రోగ్రాంలో సీనియర్ రిపోర్టర్లు పోతు రాజేందర్, లోగాని శ్రీనివాస్, ఇమంది ఉదయ్ కుమార్, యెర్రా ఈశ్వర్, జునుమాల రమేష్, కల్లోజి శ్రీనివాస్, మోటమర్రి రామకృష్ణ, శంకర్, లక్ష్మణ్, అఫ్జల్, కృష్ణ గోవింద్, కాగితపు వెంకటేశ్వర్లు, నర్సింహ్మ, పండుగ రేశ్వంత్, రవి, రాజేశ్, కుమార్, నాగాచారి, భాస్కర్, సురేష్, పూర్ణ, పాపారావు, రాజేష్, కృష్ణారావు, సుధాకర్, శ్రీనివాస్, షఫి, ఉమాకాంత్, ప్రసాద్ పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :