తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు బిజెపి జిల్లా నాయకుడు భూక్య రాజేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 99 రోజుల ప్రణాళిక పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యచరణ లేకుండానే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజలలో ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందని చరణ పైసా ఎలా చెల్లదో , కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరడం లేదని , గ్రామసభల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుందనీ విమర్శించారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతులపై దృష్టి పెట్టడం లేదనీ , అదేవిధంగా లబ్ధిదారులు పొందాల్సినటువంటి సంక్షేమ పథకాలను అనేక రకాల సమస్యలతో అవి వారికి చేరకుండా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి రెండున్నర సంవత్సరాల కాలంలో 420 హామీలలో కనీసం 6 గ్యారంటీలను కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందనీ విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లలో l1, l2 ,l3 అనేసి గ్రేడింగ్ సిస్టం పెట్టి వారికి సకాలంలో బిల్లు అందించడంలో జాప్యం జరుగుతు,అదేవిధంగా ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా అమలు చేయలేదనీ, మహిళలకు 2500 వుసే లేదనీ ,రైతు కూలీలకు భరోసా లేదునీ , భారతి ద్వారా ఒక పట్టా కూడా మంజూరు చేయలేదనీ ,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి జాడ లేదని అలాంటివి ఎన్నో సమస్యలు పెట్టుకొని, కేవలం నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చి జనాలని మోసం చేస్తూ 99 రోజుల ప్రణాళిక అంటూ కాలక్షేపం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ప్రణాళిక సంబంధించిన బడ్జెట్ను కూడా విడుదల చేయాలనీ , ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టిన తర్వాతనే గ్రామ సభలు నిర్వహించాలనీ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఇప్పటివరకు ఏ ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించకపోవడం మన జిల్లా చేసుకున్న దురదృష్టం అని ఎద్దేవా చేశారు. గ్రామసభల పేరుతో గ్రామ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా మేల్కొని ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి.
Admin
తెలుగు వెలుగు టీవీ