Wednesday, 16 September 2026 07:31:32 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సామాజిక సమానత్వానికి బసవేశ్వరుడి బోధనలు మార్గదర్శకం - జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 20 April 2026 01:37 PM Views : 192

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం శ్రీ బసవేశ్వరుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బసవేశ్వరుడు జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని అన్నారు . సమాజంలో వర్ణ వివక్ష నిర్మూలనకు, దళిత, బహుజన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి విశిష్టమని తెలిపారు. సమానత్వం, న్యాయం, శ్రమకు గౌరవం వంటి విలువలను బసవేశ్వరులు బోధించినట్లు చెప్పారు. బసవేశ్వరుడు చిన్న వయస్సులోనే శైవ సాంప్రదాయాలపై అవగాహన సాధించి కర్మకాండాలపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఉపనయనం చేయాలన్న తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి కూడల సంగమానికి చేరి సంగమేశ్వరుని భక్తితో ఆరాధించినట్లు పేర్కొన్నారు. ఆయన స్థాపించిన “అనుభవ మండపం” అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను వ్యక్తపరచుకునే వేదికగా నిలిచిందన్నారు. మనుషులందరూ ఒక్కటే”, “దేహమే దేవాలయం”, “స్త్రీ-పురుష భేదం లేదు”, “శ్రమకు మించిన సౌందర్యం లేదు” అనే బసవేశ్వరుల సందేశాలు నేటి సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. యువత ఈ విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారివిజయలక్ష్మీ, ఎ.డి. మైన్స్ జి. దినేష్, ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. ఉపేందర్, యువజన శాఖ పరందామ రెడ్డి, గుమలాపురం సత్యనారాయణ, ముదురుకోళ్ళ కిషోర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :