తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏన్కూర్ మండలం ఇమామ్నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాల్సర్ బైక్పై ఏన్కూర్ వైపు వెళ్తున్న ఇద్దరిని, జూలూరుపాడు దిశ నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న హోంగార్డు ఇమ్మడి రఘుపతి, రాజేష్లు తీవ్రంగా గాయపడగా, ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. రఘుపతి కొత్తగూడెం హెడ్క్వార్టర్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Admin
తెలుగు వెలుగు టీవీ