Thursday, 17 September 2026 07:38:53 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

సీఎం కప్ విజయాలు జిల్లాకు గర్వకారణం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 24 February 2026 08:31 PM Views : 268

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు సాధించిన విజయాలు జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు . రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలలో జిల్లా నుండి పాల్గొన్న క్రీడాకారులు వివిధ క్రీడా విభాగాలలో ప్రతిభ కనబరచి మొత్తం 54 పతకాలు సాధించడం విశేషమని అన్నారు .ఈ సందర్భంగా మంగళవారం ఐడీఓసి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పతక విజేతలను అభినందించి, వారి కృషిని ప్రశంసించారు. క్రీడాకారులు సాధించిన 15 బంగారు, 19 వెండి, 20 కాంస్య పతకాలు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయని తెలిపారు. ముఖ్యంగా అథ్లెటిక్స్ విభాగంలోనే 31 పతకాలు సాధించడం జిల్లాలో క్రీడా అభివృద్ధి దిశగా సానుకూల పరిణామమని తెలిపారు .గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన యువ క్రీడాకారులు కూడా సమానంగా ప్రతిభ చాటుకోవడం అభినందనీయమని, క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన పెంపొందుతాయని కలెక్టర్ అన్నారు . క్రీడలు విద్యతో పాటు సమాన ప్రాధాన్యత పొందాలని, పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. క్రీడాకారుల విజయాలలో కోచ్‌లు, శిక్షకులు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారుల సహకారం ప్రశంసనీయమని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా జిల్లా క్రీడాకారులు రాణించేలా అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి యం. పరంధామ రెడ్డి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ నరేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అనురాధ, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహిధర్, కొమరారం వెంకటనారాయణ (ఏఎస్ఓ, ట్రైబల్ వెల్ఫేర్), బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ మట్టపర్తి రమేష్, టైక్వాండో సెక్రటరీ రమేష్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటరామిరెడ్డి, మంజిలాల్ (పీడీ), నాగలక్ష్మి (పీడీ), చైతన్య (పీడీ), వాసు, నాగేందర్, నాగరాజు, మాలికార్జున్, గిరిప్రసాద్, కావేటి రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :