తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏజెన్సీ ప్రాంతాల్లో టీవీవీపీ ఆసుపత్రులలో అద్భుతమైన సేవలు జిల్లా ఆసుపత్రుల సేవలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు హెల్త్ సెక్రటరీ ఆదేశాల మేరకు జిల్లాకి వచ్చి ప్రత్యేకంగా అభినందించిన టీవీవీపీ కమీషనర్ అజయ్ కుమార్ ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ భద్రాద్రి జిల్లా లో ని టీవీవీపీ ఆసుపత్రులలో అద్భుతమైన సేవలు అందుతున్నాయని , జిల్లా కలెక్టర్ ప్రోత్సాహం తో DCHS డాక్టర్ రవి బాబు ,వివిధ ఆసుపత్రి సూపరింటెండెంట్ లు వారి సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తూ జిల్లా కి రాష్ట్ర స్థాయిలో గొప్ప పేరు తెస్తున్నారని, ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని టీవీవీపీ కమీషనర్ డాక్టర్ అజయ కుమార్ తెలిపారు. ఇటీవల చర్ల ఆసుపత్రి లో రెండు కిష్టమైన రోగులకు ఎంతో నేర్పుగా వైద్యం అందించి కోన ఊపిరి తో ఉన్న నెలలు నిండని కవల పిల్లలు ఉన్న గర్భిణి ని నార్మల్ డెలివరీ చేసి తల్లి తో పాటు 1.1kg బరువుతో పుట్టిన ఇద్దరు ఆడ శిశువులను కాపాడి అలాగే కిడ్నీ,కాలేయం, ఊపిరి తిత్తులు సరిగా పనిచేయక నలభై వేల తెల్ల రక్త కణాలు ఉండి కోన ఊపిరి తో ఉన్న ఒక డెబ్భై ఏళ్ల వృద్ధుడిని నాణ్యమైన వైద్యం అందించి కాపాడిన విషయం పలు జాతీయ వార్త పత్రికల్లో వచ్చిన సందర్భం లో మారుమూల ప్రాంతాల్లో సైతం అందుతున్న మెరుగైన వైద్య సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తు చర్ల సిబ్బంది ని అభినందిస్తూ తన సందేశం తెలపవాల్సినదిగా ఆదేశించగా టీవీవీపీ కమీషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ప్రత్యేకంగా భద్రాద్రి జిల్లా చేరుకుని జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మెరుగైన సేవలకు కారణమైన వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తో కలిసి పాల్వంచ లో గురువారం రాత్రి జరిగిన అభినందన కార్యక్రమంలో జ్ఞాపికలు అందజేసి హర్షం వ్యక్తంచేశారు . జిల్లాలో చర్ల తో పాటు మణుగూరు ,అశ్వారావుపేట,ఎల్లందు ,భద్రాచలం ఆసుపత్రుల్లో సైతం అద్భుతమైన వైద్య సేవలు అందుతున్నాయని డెలివరీ సంఖ్య బాగా పెరిగిందని, స్పెషలిస్ట్ వైద్యుల సేవలు జిల్లా నలుమూలల అందుబాటులో ఉండడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు. ఇటీవల వచ్చిన కేంద్ర బృదం సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేసిందని చెప్పారు.ఏ జిల్లాలో ఈ స్థాయిలో సేవలు లేవని ఆ ఘనత భద్రాద్రి జిల్లాలో ఆసుపత్రులకే దక్కిందని అందుకు జిల్లా కలెక్టర్ అందిస్తున్న ప్రోత్సాహం, మద్దతు చాలా కీలకమని ఆయన వేదిక పై ఉన్న కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చర్ల లాంటి ప్రాంతాల్లో అమోఘమైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇతర ప్రాంతాల్లో సైతం మంచి సేవలు అందిస్తున్న రని తనికి ప్రజల నుండి ప్రజాప్రతినిధుల నుండి గొప్ప ఫీడబాక్ ఉందని తెలిపారు. ఆసుపత్రుల అవసరాలకి నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చని ఆయన సిబ్బందిని సూచించారు. ఇదే స్పూర్తితో మరింత మెరుగైన సేవలు ఏజెన్సీ ప్రజలకు అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ,జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తో పాటు డి సి ఎచ్ ఎస్ డాక్టర్ రవి బాబు,జిల్లాలోని వివిధ ఆసుపత్రుల సూపరింటెండ్లు, వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ