తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న ఉద్యోగుల క్రీడా పోటీల సందర్భంగా ఆయన హాజరై చెస్, టేబుల్ టెన్నిస్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అధునాతన క్రీడా పరికరాలను సమకూర్చడమే కాకుండా, అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్వయంగా పీడీ టీచర్ ను అయినందున క్రీడల పట్ల తనకు ఎంతో విశ్వాసం ఉంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రీడాకారులను, ఉద్యోగులను నిరంతరం ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు రోజులపాటు జరగనున్న ఉద్యోగుల క్రీడా పోటీలలో పాల్గొనే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు......
Admin
తెలుగు వెలుగు టీవీ