Thursday, 17 September 2026 12:47:15 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మునగ సాగు తో ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 18 October 2024 06:17 PM Views : 746

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్,చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ ది వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన లతో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీ వోలు, ఏపీవోలు, ఏపిఎంలు మరియు ఈసీఎస్ లతో ఐ డి ఓ సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ మన జిల్లాలో లోని రైతులు వరి, పత్తి మరియు మొక్కజొన్న పంటలు పండించడానికి ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే ఎకరానికి 20000 నుండి 30000 వరకు మాత్రమే లభిస్తుందన్నారు. రైతుకుఅధిక లాభం పొందేలా మనం ఉపాధి హామీ పథకం ద్వారా చేయవచ్చని తెలిపారు. మునగ సాగు ఎందుకు చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఎండాకాలంలో పొలాలు ఖాళీగా ఉంటాయని ఇప్పుడు వచ్చిన పంట డబ్బులు నుంచి కేవలం 10000 రూపాయలు పెట్టుబడి ద్వారా అంటే 2000 రూపాయలు విత్తనాలు, 2000 రూపాయలు ప్లాస్టిక్ బ్యాగులకు ఇంకా మట్టి ఎరువులకు తదితర ఖర్చులకు ఈ పెట్టుబడే డబ్బులు కూడా రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా మొక్క పెట్టుబడి కింద ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఎండాకాలంలో రైతులు పొలంలో ఖాళీగా ఉంచకుండా మునగ సాగు చేయాలని, దాని ద్వారా అధిక ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మునగ సాగు లో మునగ ఆకు పొడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ప్రస్తుతం మార్కెట్లో మునగాకు పొడి ధర కేజీ వెయ్యి రూపాయలు గా ఉందని చెప్పారు.అదేవిధంగాఒకవేళ కాయలు పెద్దవిగా అయ్యి ఎండిపోయినప్పటికీ, ఆ గింజ ద్వారా వచ్చే నూనెకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని ప్రస్తుతం మార్కెట్లో లీటర్ మునగ నూనె ధర 3000 గా ఉందని, ఏ విధంగా చూసినప్పటికీ మునగ సాగు లాభదాయకమని అన్నారు. కేవలం 10000 రూపాయల పెట్టుబడితో 90 వేల నికర ఆదాయం, మళ్లీపెట్టుబడి 10000 ఉపాధి హామీ పథకం కిందతిరిగి వస్తుందని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దీనిలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో పదివేల ఎకరాలు మునగ సాగు జనవరిలో చేపట్టే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు కల్లా మొదటి విడత సాగులో కు రైతులకు సంబంధించిన వివరాలు, రైతు పేరు, చిరునామా, రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది, మునగ సాగుకు అంగీకరించారు, నీటి లభ్యత, బోరు ఉందా లేదా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. తదుపరి రైతుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు వివరాలు ఒకవేళ రైతుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు లేనట్లయితే కార్డ్ ఇప్పించాలి అని తెలిపారు. జిల్లాలో మొక్కజొన్న పత్తి వరి ఆయిల్ ఫామ్ సాగు లో కేవలం మూడు శాతం మునగ సాగు చేసే లా చర్యలు చేపట్టాలని అదికాలను ఆదేశించారు. గుండాల ఇల్లందులో మొక్కజొన్న,పత్తి మొత్తం 32 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది అని దీనిలో 1400 ఎకరాల్లో మునగ సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చిన్న,సన్నకారు రైతులు మునగ సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని తెలిపారు. మునగ సాగు ఎలా చేయాలి, ఏం ఎరువులు వాడాలి దానిలో వచ్చే లాభాలు గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు అందజేస్తామని తెలిపారు.మునగ సాగు చేసే ప్రతి రైతు గట్టు పైన వెదురు మొక్కలు పెంపకం చేపట్టాలన్నారు.మూడు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఆయిల్ ఫామ్ తోటల్లో అంతర పంటగా మునగ సాగు తప్పనిసరి అని అన్నారు. జిల్లాలో ఇరిగేషన్ శాఖ పరిధిలో చాలా ఎకరాల ఖాళీ ప్రదేశాలు ఉన్నాయని, ఆ ప్రదేశాలను వెదురు మొక్కలతో నింపాలని ఆదేశించారు. జిల్లాలోని కాలువలకు ఇరువైపులా జామాయిల్,వెదురు,సుబాబులు మొక్కలు నాటాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో పుట్టగొడుగులపెంపకం, చేపల పెంపకం అధిక సంఖ్యలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అజోల్ల సాగు నీటి లభ్యత పై ఆధారపడి ఉంటుందని, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యత ఉంటే అజోల్ల సాగు చేపట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, అదనపు డిఆర్డిఓ ఎన్ రవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ పృథ్వి, శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :