తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ అన్నారు.రాజేందర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో గెట్ టు గెదర్ లెజెండ్స్ క్రికెట్ పోటీలలో రెండో రోజు పోటీలను టాస్ వేసి ప్రారంభించారు,కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను అలరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలకు వయస్సుతో సంబంధం ఉండదని ఈ టోర్నమెంట్ ద్వారా నిరూపితమైందన్నారు ప్రతీ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరగడం గొప్ప విషయమన్నారు. క్రికెట్ పోటీలు నిర్వహించడం ప్రస్తుత తరుణంలో అంత ఆషామాషీ విషయం కాదని పేర్కొన్నారు.మొదటి మ్యాచ్ పుష్ప రాజ్ లెవెన్ జట్టుకి, సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 8 ఓవర్లలో 62 పరుగులు చేయగా పుష్ప రాజ్ లెవన్ జట్టు 6 ఓవర్లలోనే 63 రన్స్ చేసి గెలుపొందారు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా పుష్ప రాజ్ టీం బ్యాట్స్ మెన్ ట్రాఫిక్ ఏస్.ఐ నరేష్ కు సీనియర్ న్యాయవాది పలివెల సాంబశివరావు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోపీ అందజేశారు.తర్వాతి మ్యాచ్ లో ఎన్ఎంసిసి వర్సెస్ ఎంసిసి జట్ల మధ్య జరగగా ఎంసిసి జట్టు గెలుపొందారు.ఎంసిసి జట్టు కెప్టెన్ సూర్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ట్రోపి గెలుపొందారు.ఈ కార్యక్రమంలో రాజేందర్ సేవా సంస్థ వ్యవస్థాపకులు,హైకోర్టు న్యాయవాది యెర్రా కామేష్,లింగేశ్,బి.శ్రీను,బండి విజయ్ భాస్కర్,దుషాంత్,జంగా శ్యామ్,రఫీ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ