Thursday, 17 September 2026 07:38:22 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా క్రీడా పోటీలు.

Date : 03 December 2025 06:50 PM Views : 325

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు స్థానిక ఉన్నత పాఠశాల నందు మండల స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూలూరుపాడు మండల అభివృద్ధి అధికారి పూరేటి అజయ్ , మండల విద్యాశాఖ అధికారి బి. జుంకీలాల్ , జూలూరుపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పెట లక్ష్మీ నరసయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ బాలబాలికలు వారి తల్లిదండ్రులు హాజరవడం జరిగింది. తల్లిదండ్రులకి అవగాహన కార్యక్రమం నిర్వహించి అనంతరం అందరి అతిథులు యొక్క ప్రసంగాలు కొనసాగాయి. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి శ్రీ పూరేటి అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫునుండి ఎటువంటి ఆటంకాలు లేకుండా సకాలంలో దివ్యాంగులకు అన్ని రకాల పనులు చేసి పెట్టేందుకు వ్యవస్థ సిద్ధంగా ఉందని ఎవరూ అధైర్య పడద్దని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.అనంతరం స్థానిక మండల విద్యాశాఖ అధికారి బి. జుంకీలాల్ మాట్లాడుతూ దివ్యాంగులు వారి యొక్క విద్య అభ్యాసం వంటి విషయాలలో ప్రభుత్వం ఎన్నో మంచి సౌకర్యాలు కల్పించిందని దివ్యాంగ బాలబాలికల యొక్క తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహ పడకుండా పిల్లల యొక్క సంపూర్ణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ SA మరియు మాచినపేట పాఠశాలలో మరొక స్పెషల్ ఎడ్యుకేటర్ SGT, అలాగే మండలంలో ఇద్దరు ఐఆర్పీలు అందరూ కూడా ఈ పిల్లల యొక్క సకల అవసరాలను తీర్చడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని వీరి సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి వక్తగా వ్యవహరించినటువంటి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ జి. నాగ రమేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు పిల్లలకు ఎటువంటి సౌకర్యాలు విద్యాశాఖ నుండి కల్పించబడ్డాయో వివరించారు. అలాగే వారానికి రెండు రోజులు అనగా సోమవారం మరియు బుధవారం ఉచిత ఫిజియోథెరపీ క్యాంపు స్థానిక జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతుంది దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా మండలంలోని దివ్యాంగ బాలబాలికల యొక్క గుర్తింపు మరియు వారి యొక్క అవసరాలు తీర్చడం వారికి సకాలంలో సమాచారం అందించి సదరం సర్టిఫికెట్లు మరియు సహాయ ఉపకరణాలు పొందే విధంగా కృషి చేసినటువంటి మండల ఐఇఆర్పిలు సాంబశివరావు మరియు శ్రీనివాస్, ఇద్దరినీ కూడా విద్యాశాఖ అధికారి అభినందించారు.అనంతరం కార్యక్రమానికి హాజరైనటువంటి దివ్యాంగ బాలబాలికలు అందరికీ అండర్ 14 అండర్ 17 అనే విభాగాలుగా రన్నింగ్, మ్యూజికల్ చైర్, క్యారమ్స్, చెస్ లాంటి ఆత్మస్థైర్యాన్ని నింపే అనేక ఆటలు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆటలలో పాల్గొన్న దివ్యాంగ బాలబాలికలు అందరికీ బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. అనంతరం కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారిలో స్థానిక ప్రజలు, దివ్యాంగ బాలబాలికలు వారి తల్లిదండ్రులు, ఉన్నత అధికారులు, జూలూరుపాడు ఉన్నత పాఠశాల సిబ్బంది మరియు ఉపాధ్యాయులు, ఫిజియోథెరపిస్ట్ మేడం శ్రీజ అలాగే పాఠశాలలో విద్యనుభ్యసిస్తున్న దివ్యాంగ బాలబాలికలు కూడా ఉన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :