తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు కొత్తగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో గురువారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్. జానయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే వేలంలో ఆసక్తి ఉన్నవారు డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని సూచించారు. ఆధార్, పాన్కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ