Friday, 18 September 2026 05:16:46 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Date : 01 June 2026 07:07 PM Views : 128

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూన్ నాటికి పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ ఎందుకు పూర్తికాలేదని అధికారులను ప్రశ్నించారు. పనుల ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, నిర్దేశిత గడువుల్లో పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.పినపాక నియోజకవర్గ రైతులే సీతారామ ఎత్తిపోతల పథకం కోసం తొలుత భూములు అందించారని గుర్తుచేసిన మంత్రి, ఈ ప్రాజెక్టు ద్వారా మొదటగా పినపాక నియోజకవర్గ రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సాగునీటి వసతుల కల్పన ద్వారా వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలంటే ఇంకా రూ.9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చొరవతో డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ పనుల కోసం ఇప్పటికే రూ.4 వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేస్తే వచ్చే ఏడాది నాటికి పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సుమారు ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు పూర్తయితే 38 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చి, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని విస్తారమైన ఆయకట్టుకు సాగునీరు అందించగలమని తెలిపారు.సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువను ప్రారంభ స్థానం నుంచి చివరి వరకు పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో ఎక్కడైనా మట్టి పేరుకుపోయిన ప్రాంతాలు, జారిన గట్లు లేదా ఇతర అవరోధాలు ఉంటే వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో నీటి విడుదలకు ముందే కాలువలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా నిర్వహణ పనులను వేగవంతం చేయాలని, రైతులకు సాగునీరు సకాలంలో అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి సంధ్యా సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :