Wednesday, 04 November 2026 10:19:35 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

అనిశెట్టిపల్లి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 17 December 2025 01:09 PM Views : 406

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా టేకులపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను సమగ్రంగా పర్యవేక్షిస్తూ, ఓటింగ్ సజావుగా జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాలట్ పేపర్లు, సీలింగ్ విధానం, ఓటర్ల రిజిస్టర్, పోలింగ్ సిబ్బంది హాజరు తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక వసతులు — త్రాగునీరు, ర్యాంప్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించి, అవసరమైన సూచనలు ఇచ్చారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడిన జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరగేలా చూడాలని ఆదేశించారు. సమస్యాత్మక పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏ చిన్న లోపం కనిపించినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత ఎన్నికల అధికారులు, మండల స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :