Wednesday, 16 September 2026 07:38:18 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

మంత్రి తుమ్మల అరుదైన రికార్డు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు 21సార్లు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జండా ఆవిష్కరణ.

Date : 13 August 2026 08:37 PM Views : 153

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంత్రి తుమ్మల అరుదైన రికార్డు.రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘట్టం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు 21సార్లు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జండా ఆవిష్కరణ.నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం. 4 ప్రభుత్వాల సాక్షిగా ఒకే గౌరవం. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డు ఒకటి ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరిట లిఖితం కానుంది. నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో నాలుగు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.ప్రజాస్వామ్యంలో దేశంలో రాజకీయాల్లో పార్టీలు మారతాయి... ప్రభుత్వాలు మారతాయి... కానీ ఒక నేత పట్ల ప్రజావిశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు! తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయంలో ఇది అక్షర సత్యం. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణ చేసే గౌరవం వరుసగా ఆయనకే దక్కుతూ వస్తోంది. ఇప్పటికే 20సార్లు ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్న తుమ్మల, ఈనెల 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21వసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇదొక సరికొత్త ఘట్టంగా నిలవనుంది.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేయడం ప్రతి నేతకూ లభించే గౌరవం. అలాంటి అరుదైన అవకాశం తుమ్మలకు ఏకంగా 20 సార్లు దక్కడం, ఈనెల 15న 21వ సారి దక్కనుండటం విశేషం.నాలుగు ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలు1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనే మంత్రి పదవి చేపట్టారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన, ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా వ్యవహరించారు. మైనర్ ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, ప్రొహిబిషన్-ఎక్సైజ్, మేజర్-మైనర్ ఇరిగేషన్ వంటి కీలక శాఖలను నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా.రాజకీయ ప్రస్థానంలో తుమ్మల ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఈ సుదీర్ఘ ప్రజాజీవితంలో మంత్రిగా ఉన్న దాదాపు ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరణ చేసిన ఘనత ఆయనది. వేర్వేరు రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల మార్పుల మధ్య కూడా ఈ గౌరవం వరుసగా దక్కడం ఆయన సుదీర్ఘ ప్రజాజీవితానికి నిదర్శనంగా నిలుస్తోంది.20 సార్లు జెండా ఆవిష్కరణ.. ఇప్పుడు 21వ సారి1985 నుంచి 1989 వరకు ఐదుసార్లు, 1995 నుంచి 2003 వరకు తొమ్మిదిసార్లు, 2015 నుంచి 2018 వరకు నాలుగుసార్లు, 2024, 2025 సంవత్సరాల్లో ఒక్కోసారి చొప్పున ఇప్పటివరకు 20 సార్లు తుమ్మల నాగేశ్వరరావు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో 2026 ఆగస్టు 15న 21వసారి ఈ గౌరవం దక్కడం రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది.79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఈనెల 15న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయనకు, తన సొంత ప్రాంతానికి ఆనుకుని ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ బాధ్యత దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం.పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధిగా తన స్థానాన్ని పదిలంగా నిలుపుకుంటూ వస్తున్న తుమ్మల నాగేశ్వరరావు రికార్డు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలో అరుదైనదిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నలుగురు ముఖ్యమంత్రుల పాలనా కాలాల్లో ప్రభుత్వం తరఫున జాతీయ పతాకావిష్కరణ చేసిన అనుభవం చాలా తక్కువ మంది నేతలకు మాత్రమే దక్కుతుంది. ఈ కోణంలో చూస్తే, తుమ్మల నాగేశ్వరరావుది నిరాటంకమైన, స్థిరమైన రాజకీయ జీవితానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఇప్పటివరకు తుమ్మల జాతీయ పతాకావిష్కరణ చేసిన సంవత్సరాలు1985, 1986, 1987, 1988, 1989, 1995, 1996, 1997, 1998, 1999, 2000, 2001, 2002, 2003, 2015, 2016, 2017, 2018, 2024, 2025

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :