Thursday, 02 July 2026 07:07:05 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

రుద్రంపూర్ ఐటిఐ కళాశాలలో శిక్షణ పొందుతున్న గిరిజన యువతకు వెల్డింగ్ మెషిన్స్,టూల్ కిట్స్ ను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 27 June 2025 05:55 PM Views : 850

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ స్కీం ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఐటిఐ కళాశాలలో పలు వృత్తులలో నైపుణ్యం సాధించిన యువకులకు వెల్డింగ్ మెషిన్స్,టూల్ కిట్స్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తమ చేతులు మీదుగా అందజేయడం జరిగింది.మొత్తం 10 యూనిట్లను అందజేయడం జరిగింది.ఒక్కో యూనిట్ ధర 55,000/- రూపాయలని తెలిపారు.ఐ.టి.ఐ.కాలేజీ,రుద్రంపూర్ నందు వెల్డింగ్ వర్క్ షాప్ లో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ స్కీమ్ (SCA) ద్వారా గత నెలలో కాట్స్,చైర్స్ మరియు టేబుల్స్ (ఫర్నిచర్) ను వెల్డింగ్ వృత్తిలో నైపుణ్యం పొందిన గిరిజన యువతతో తయారు చేయించడం జరిగిందని కళాశాల యాజమాన్యం మరియు అధికారులు ఎస్పీ గారికి వివరించారు.ఆ ఫర్నిచర్ ను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు,వెల్డింగ్ మిషన్స్ మరియు టూల్ కిట్స్ ను వెల్డింగ్ ట్రైనీస్ కు ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది.అనంతరం ఐటిఐ కళాశాల నందు గల మెకానికల్,ఎలక్ట్రికల్,ఫిట్టర్ మరియు తదితర విభాగాలను ఎస్పీ సందర్శించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండే సరైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని క్రమశిక్షణతో మెలిగితే జీవితంలో విజయం సాధిస్తారని సూచించారు.ఎలాంటి చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా,మంచి స్నేహితులను ఏర్పరుచుకుని తాము నిర్దేశించుకున్న గమ్యం వైపు అడుగులు వేయాలని తెలిపారు.వృత్తి నైపుణ్యంతో జీవితంలో విజయం సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.జిల్లాలోని ఆదివాసీ,గిరిజన యువత అభివృద్ధి వరకూ పోలీస్ శాఖ కూడా అన్ని రకాలుగా కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ BC వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిరా గారు, కొత్తగూడెం డీస్పీ రెహమాన్ గారు, ఐ.టి.ఐ కాలేజీ ప్రిన్సిపాల్, DRDA APM వెంకయ్య,ఐ.టీ.ఐ కాలేజీ స్టాఫ్ మరియు వెల్డింగ్ ట్రైనీస్ పాల్గొనటం జరిగింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :