Thursday, 17 September 2026 09:07:20 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సీతారామ ప్రాజెక్టు నీళ్ళు జూలూరుపాడు కు ఇవ్వాలి : బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 28 August 2024 07:03 PM Views : 572

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : సీతారామ నీళ్ళు జూలూరుపాడు మండలానికి ఇవ్వాలని,సీతారామ ప్రాజెక్టు నీళ్ళ విషయంలో జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను విరమించుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం పార్టీ శ్రేణులతో కలసి వినోబా నగర్ లింకు కాలువను పరిశీలించి మాట్లాడుతూ పాత డిజైన్ ను మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని,పాత డిజైన్ ను అమలు చేసి 20 మండలాలకు సీతారామ ప్రాజెక్టు కెనాల్ కు అనుసంధానం చేసి నీరు అందించాలన్నారు.2005 సంవత్సరంలో దుమ్ముగూడెం ప్రాజెక్టుతో మొదలై మధ్యలో సీతారామ ప్రాజెక్టుగా అవతరించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో తవ్వినటువంటి కాలవను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రూట్ మ్యాప్ తీసుకువచ్చి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో వినోబా నగర్ వద్ద నుండి ఖమ్మంకు కాలువ తవ్వుతున్నారని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు,అదేవిధంగా జూలూరుపాడు మండలంలోని పంట కాలువల ద్వారా ప్రతి చెరువును నింపిన తర్వాతనే వేరే జిల్లాకు తరలించాలని డిమాండ్ చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీరు మొత్తం,వేరే జిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్ళడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు?? ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు 40% పూర్తయింది ఇంకా 60 శాతం పనిచేయాల్సి ఉంది అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీతారాం ప్రాజెక్టు కాలవను ఎలా ఓపెన్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.జిల్లావ్యాప్తంగా చెరువులను కుంటలను నింపేందుకు కాలవలు తవ్వకుండా ఖమ్మం జిల్లాకి వెళ్ళేటటువంటి కాలువ పనులు చక చక చేయించటం ఎందుకని,జిల్లా ప్రజలకు తీరని నష్టం జరుగుతున్నా ప్రజల ఓట్లతో గెలిచిన ఎంఎల్ఏలు ఎందుకు మౌనంగా వుంటున్నారని ప్రశ్నించారు.ఏదిఏమైనాప్పటికీ జిల్లాకు నీటిని అందించకుండా,జూలూరుపాడు మండలానికి నీరునందించకుండా వేరే జిల్లాకి తరలిస్తే ప్రజాఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బీఎస్పీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు,శివ,బన్నీ,నరేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :