తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు సత్యసాయి ట్రస్ట్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏబీవీపీ కార్యకర్త నుండి జిల్లా అధ్యక్షుడి వరకు అనేక పదవులను అలంకరించి ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా నిరంతరం పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లే సైనికుడిగా పనిచేస్తున్న బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయదుందుభి మోగిస్తామని ఈ సందర్భంగా అన్నారు, ఈ కార్యక్రమంలో వృద్ధులకి పండ్లు బిస్కెట్లు చాక్లెట్లు పంచడం జరిగినది ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ నాయకులు శివకృష్ణ,పట్టణ జనరల్ సెక్రెటరీ మాధాకృష్ణారెడ్డి,జల్లారపు శ్రీనివాస్, శంకర్, కృష్ణ, పట్టణ ఉపాధ్యక్షుడు బానోత్ రాంబాబు నాయక్, మునిగ వెంకన్న, అగుల్ల విరేశలింగం మరియు పార్టీ నాయకులు మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ