తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 7వ తేదీన ఉ. 10 గంటలకు దేశ ప్రజలంతా వందేమాతరం గేయం ఆలపించాలని కోరింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గవర్నర్, ముఖ్యమంత్రుల నేతృత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం.
Admin
తెలుగు వెలుగు టీవీ