Sunday, 02 August 2026 04:10:52 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మహిళల భద్రతే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం షీ టీమ్స్, AHTU కార్యాలయాల్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

Date : 07 April 2026 08:02 PM Views : 208

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంగళవారం చుంచుపల్లిలోని షీ టీమ్స్,AHTU కార్యాలయాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు.ముందుగా షీ టీం,AHTU కార్యాలయ పరిసరాలను పరిశీలించారు.మహిళలపై లైంగిక వేధింపులు,ర్యాగింగ్,ఈవ్ టీజింగ్,బ్లాక్మెయిలింగ్,ఇతర ఇబ్బందులు ఎదుర్కునే మహిళలు జిల్లా షీ టీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.మహిళలలపై జరుగుతున్న నేరాలను అడ్డుకొని వారికి న్యాయం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేసిన TGWSW ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన విభాగమే షీ టీమ్స్ అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.జిల్లా షీ టీమ్స్ ఫోన్ నంబరు 8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యలని తెలియజేసుకోవచ్చని అన్నారు.ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగా ఉంచబడతాయని అన్నారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే నేరస్తుడిని షీ టీం కార్యాలయానికి పిలిచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పరిస్థితిని బట్టి నిందితుడిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.బాలికలకు,మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా షీ టీమ్స్ ను సంప్రదించాలని తెలియజేసారు.జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో,రైల్వేస్టేషన్,బస్టాండ్లు మరియు కళాశాలల వద్ద షీ టీమ్స్ సభ్యులు నిరంతరం సంచరిస్తూ ఆకతాయిల ఆగడాలను నిరోధిస్తూ మహిళలకు అండగా నిలవాలని సూచించారు.మానవ అక్రమ రవాణా చేసి వారి అవయవాలను విక్రయించడం,వారితో వెట్టిచాకిరీ చేయించడం,వ్యభిచారంలోకి లాగడం,బాల్య వివాహాలు చేయడం లాంటివి జరగకుండా AHTU సిబ్బంది భాద్యతగా పనిచేయాలని సూచించారు.ఇటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి నిరంతరం జిల్లా మొత్తం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.మఫ్టీ దుస్తులలో సంచరిస్తూ నేరాలు జరగడానికి అవకాశం ఉండే ప్రదేశాలలో AHTU మరియు షీ టీం సిబ్బంది నిరంతరం సంచరిస్తూ ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మణ్,షీ టీం ఏఎస్సై నాగయ్య,షీ టీం సభ్యులు మల్లికాంబ,రాంబాబులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :